ఐకాన్ స్టార్ లేకుండానే ‘ఐకాన్’ సిద్ధమవుతుందట!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘తమ్ముడు’ జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో నిర్మాత దిల్ రాజు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.

ఆయన గతంలో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్‌తో అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తాడని ప్రకటించారు. అయితే, ఆ సినిమా పట్టాలెక్కడం ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో బిజీ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఐకాన్ సినిమాను ఆయనతో చేయడం దాదాపు అసాధ్యం.

దీంతో ఈ సినిమా పట్టాలెక్కదని పలువురు కామెంట్ చేస్తున్నారు. కానీ, ఐకాన్ సినిమా ఖచ్చితంగా ఉంటుందని.. త్వరలోనే వేరొక హీరోతో ఈ సినిమాను స్టార్ట్ చేస్తామని దిల్ రాజు అనౌన్స్ చేశాడు. దీంతో ఈ ఐకాన్ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version