‘కన్నప్ప’ కోసం ప్రభాస్ ప్రమోషన్స్.. ఏమన్నాడంటే..?

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ప్రతిష్టాత్మకం చిత్రం ‘కన్నప్ప’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విష్ణు మంచు హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే, ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రభాస్ పలు ఈవెంట్స్‌కు వస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన సైలెంట్‌గా ఉండిపోయారు. కాగా, ఇప్పుడు ‘కన్నప్ప’ చిత్రాన్ని ప్రభాస్ ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో ‘కన్నప్ప’ చిత్రాన్ని ప్రభాస్ ప్రమోట్ చేశాడు. ‘కన్నప్ప’ లాంటి పరమభక్తుడు, అతని త్యాగం గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాలని ప్రభాస్ కోరాడు.

ఇక ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో డా ఎం.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. జూన్ 27న ‘కన్నప్ప’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.

Exit mobile version