స్టార్ హీరోతో త్రిష రిలేషన్.. నిజమేనా ?

సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, యంగ్ దర్శకుడు వశిష్ట కలయికలో వస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. ఐతే, గత కొంతకాలంగా త్రిష పెళ్లి పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు 41 ఏళ్లు దాటిపోతున్నా త్రిష ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. ఐతే, త్రిష, స్టార్ హీరో విజయ్‌తో రిలేషన్‌లో ఉందని గతంలో రూమర్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో త్రిష తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా చేసిన లేట్ నైట్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌లో విజయ్ ఒక కుక్కపిల్లని ఎత్తుకొని ఆడిస్తూ ఉండగా, త్రిష.. విజయ్ పక్కనే కూర్చుని నవ్వుతూ కనిపించింది. ఆ కుక్క పిల్ల త్రిష పెంచుకునే ఇజ్జీ కాగా, దాన్ని విజయ్ ఆడిస్తూ ఉండడంతో ఇప్పుడు ఈ న్యూసే హాట్ టాపిక్ గా మారింది. మరి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియాలంటే.. వారిద్దరూ అధికారకంగా క్లారిటీ ఇవ్వాల్సిందే.

Exit mobile version