టాలీవుడ్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకున్న నటుడు శ్రీరామ్ పలు ఇంట్రెస్టింగ్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే, ఆయనను తాజాగా తమిళనాడు పోలీసులు డ్రగ్స్ వినియోగం కేసులో అరెస్ట్ చేశారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
AIADMK పార్టీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో చెన్నై పోలీసులు శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ పోలీసులు శ్రీరామ్‌ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన రక్త నమూనాలను సేకరించి ఆయన్ను విచారించారు.
ఇప్పటికే సదరు రాజకీయ నేతతో పాటు ఈ డ్రగ్స్ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన ఆధారాలతో ఇప్పుడు శ్రీరామ్‌ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం కోలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది.