‘యుఫోరియా’తో గుణశేఖర్ లో కొత్త కోణం !

గుణశేఖర్‌ దర్శకత్వంలో విఘ్నేశ్‌ గవిరెడ్డి హీరోగా రాబోతున్న సినిమా ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుందట. గుణశేఖర్ రాసిన స్క్రిప్ట్ చాలా కొత్తగా ఉండబోతుందని.. గుణశేఖర్ లో కొత్త కోణాన్ని చూస్తారని.. అలాగే ప్రధానంగా నేటి యువత తాలూకు ఎమోషన్స్ ను చాలా బాగా చూపించబోతున్నారని తెలుస్తోంది. కాబట్టి.. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ చిత్రంలోని ‘‘రామ రామ..’’ అంటూ సాగే గీతాన్ని టీం ఇప్పటికే విడుదల చేశారు. ఈ పాటకు కాలభైరవ స్వరాలు సమకూర్చగా.. చైతన్య ప్రసాద్‌ సాహిత్యమందించారు. ఈ సందర్భంగా గుణశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘నాతో పాటు రాగిణి, నీలిమ, యుక్త కలిసి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గట్లుగా ఉంటుంది. అలాగే అందరికీ కనెక్ట్‌ అయ్యే మంచి సందేశం కూడా ఉంది. ఈ సినిమాతో దాదాపు 20మంది కొత్తవాళ్లు తెరకు పరిచయం కానున్నారు’’ అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

Exit mobile version