నేడు వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా అనేకమంది సినీ ప్రముఖులు తమ నాన్నలతో కలిసి పలు ఫోటోలు వారితో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ ఈ స్పెషల్ డే ని జరుపుకుంటున్నారు. మరి ఇలా మన టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు కూడా తమదైన పోస్ట్ లతో పంచుకున్నారు.
మరి మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ ఫ్యామిలీ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి మహేష్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార తన నాన్నతో కలిసి స్పెషల్ మిర్రర్ సెల్ఫీలు షేర్ చేసుకొని హ్యాపీ ఫాదర్స్ డే నాన్న ఐ లవ్ యూ సో మచ్ అంటూ తన ప్రేమని మహేష్ పై వ్యక్తం చేసింది.
మరి ఈ పిక్స్ లో మహేష్ తన వెనుక కనిపిస్తున్నారు. ఇలా మొత్తానికి ఈ స్పెషల్ పిక్స్ అభిమానుల నడుమ మంచి వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.