పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజిత్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘ఓజి’. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో పవన్ ఓ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపంచనున్నాడు. అయితే, ఈ చిత్ర షూటింగ్ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.
కాగా, ప్రస్తుతం పవన్ తన సినిమాలను ముగించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసిన పవన్, ఇప్పుడు ఓజి చిత్రాన్ని కూడా ముగించాలని చూస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ముంబైలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ విజయవాడలో నిర్వహించనున్నారు. కాగా, ఈ షెడ్యూల్ జూన్ 5 నుండి ప్రారంభం అవుతుందట.
ఇక ఈ షెడ్యూల్ను జూన్ 16తో ముగించాలని.. తద్వారా ఓజి చిత్ర షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్కు రెడీ చేస్తున్నారు.