Record Alert: 75 రోజుల ముందే బుకింగ్స్‌తో వార్ స్టార్ట్ చేసిన హీరోలు.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై వస్తున్న ‘వార్-2’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు వారు రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా 75 రోజుల సమయం ఉండగా, ఈ చిత్ర బుకింగ్స్‌ను ఓవర్సీస్‌లో మొదలుపెట్టారు.

దీంతో ఈ సినిమా కోసం ఓవర్సీస్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అటు, ఈ సినిమాపై మేకర్స్ ఏ రేంజ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉంటే, ఇలా 75 రోజుల ముందే టికెట్ బుకింగ్స్ ప్రారంభిస్తారని పలువురు కామెంట్ చేస్తున్నారు. వార్-2 చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయింది.

Exit mobile version