యూఎస్‌లో తగ్గేది లేదంటున్న ‘సింగిల్’.. ఆ మార్క్ టచ్ చేస్తుందా..?

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సింగిల్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ రాజు డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. ఇక శ్రీవిష్ణు మరోసారి తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు ఓవర్సీస్‌లో సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకునే సినిమాలేమీ లేకపోవడంతో, ఆడియన్స్ ‘సింగిల్’ సినిమాకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమా తాజాగా అమెరికాలో 700K డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ తెలిపారు.

ఈ వారం కూడా పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో సింగిల్ చిత్రం కలెక్షన్స్ పరంగా మరింత దూసుకెళ్లడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామలు కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలింస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

Exit mobile version