AA22 X A6: ఐకాన్ స్టార్ తో డిస్కషన్ లో అట్లీ.. భారీ ప్రాజెక్ట్ పై క్రేజీ డీటెయిల్స్

రీసెంట్ గా మన ఇండియన్ సినిమా నుంచి ఇంటెర్నేషల్ లెవెల్లో స్టాండర్డ్స్ తో అనౌన్స్ చేసిన భారీ చిత్రమే అట్లీ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల ప్రాజెక్ట్ అని చెప్పాలి. అయితే ఈ సెన్సేషనల్ కలయిక అనౌన్స్మెంట్ తోనే ఎన్నో అంచనాలు సెట్ చేసుకోగా ఈ తర్వాత భారీ సినిమా శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

అయితే లేటెస్ట్ గా బన్నీని హైదరాబాద్ లో అట్లీ కలిసేందుకు వచ్చిన విజువల్స్ వైరల్ గా మారాయి. కీలక డిస్కషన్స్ కోసం వీరు కలవగా ఈ చిత్రంపై మరిన్ని క్రేజీ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. ఈ చిత్రం అల్లు అర్జున్ నుంచి కంప్లీట్ గా తెలుగు సినిమానే అట.

అట్లీతో అల్లు అర్జున్ తమిళ్ సినిమా తీస్తున్నాడు అనుకున్నారు చాలా మంది కానీ అట్లీనే తెలుగులో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడట. అలాగే ఈ చిత్రాన్ని సాలిడ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే ప్లాన్స్ చేస్తుండగా ఈ జూన్ నుంచే షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తానికి మాత్రం ఈ భారీ కలయిక ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది అని చెప్పాలి.

Exit mobile version