గుడ్ న్యూస్ చెప్పిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటి

లేటెస్ట్ గా మన తెలుగు సినిమా దగ్గర రీ రిలీజ్ కి వచ్చిన చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకీ మామ హీరోలుగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా మళ్ళీ వచ్చి హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో మంచి పాత్ర చేసిన ప్రముఖ నటి అభినయ కోసం అందరికీ తెలిసిందే.

అయితే ఈ యువ నటి ఇపుడు ఓ గుడ్ న్యూస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది. తాను పెళ్లి సిద్ధం అయ్యినట్టుగా తన ఎంగేజ్మెంట్ పిక్ ని షేర్ చేసుకున్నారు. తనకి కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతూ తాము ఒకటి కాబోతున్నట్టుగా రివీల్ చేశారు. అయితే ఈమె ఎవరిని పెళ్లాడనున్నారు అనేది మాత్రం రివీల్ చేయలేదు. దీనితో శుభవార్తని ఆమె షేర్ చేయగా సినీ ప్రముఖులు ఆమె ఫాలోవర్స్ ఆమెకి సుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Exit mobile version