తెలుగులో “ఛావా” రెండు రోజుల వసూళ్లు!

బాలీవుడ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ “ఛావా” లేటెస్ట్ గాన్ తెలుగులో కూడా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) హీరోగా రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమా ఇండియా వైడ్ గా 500 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. అయితే తెలుగులో కూడా మంచి డిమాండ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా మొదటి రోజుకి 3 కోట్ల దగ్గర గ్రాస్ ని అందుకొని అదరగొట్టగా డే 2 కూడా సాలిడ్ నంబర్స్ అందుకున్నట్టుగా తెలుస్తుంది.

లేటెస్ట్ పి ఆర్ లెక్కల ప్రకారం ఛావా సినిమా తెలుగులో రెండో రోజు 3.8 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో రెండు రోజుల్లో 6.8 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ చిత్రం అందుకుంది. ఇక ఈ ఆదివారం కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని ఛావా కనబరుస్తుండడం విశేషం. దీంతో ఈ వీకెండ్ కి తెలుగులో ఛావా అదరగొడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేశారు.

Exit mobile version