‘జటాధర’ సాలిడ్ అప్డేట్‌కు టైమ్ ఫిక్స్

హీరో సుధీర్ బాబు కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘జటాధర’. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే, ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

‘జటాధర’ మూవీకి సంబంధించిన ఈ ట్రీట్‌ను మార్చి 8న ఉదయం 11 గంటలకు అందించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మహిళా దినోత్సవం రోజున ఈ అప్డేట్ వస్తుండటంతో ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్‌ను పరిచయం చేస్తారనే టాక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త సినీ సర్కిల్స్‌లో వైరల్ అయ్యింది. మరి మార్చి 8న రానున్న ‘జటాధర’ ట్రీట్ ఏమిటో తెలియాలంటే రేపు ఉదయం 11 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version