‘మజాకా’ నాన్-థియేట్రికలర్ రైట్స్‌కు సాలిడ్ క్రేజ్

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ దక్కింది.

మజాకా చిత్రానికి సంబంధించి తాజాగా నాన్-థియేట్రికల్ డీల్ క్లోజ్ అయినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్‌ను జీ స్టూడియోస్ దాదాపు రూ.20 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రూ.33 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. దీంతో మరో రూ.13 కోట్ల మేర ఈ మూవీ కలెక్ట్ చేయాల్సి ఉంది.

ఈ సినిమాలో అందాల భామ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా రావు రమేష్, అన్షు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్,, హాస్య మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version