సుదీర్ బాబు హీరోగా రాబోతున్న సినిమా ‘ప్రేమ కథా చిత్రమ్’. ఈ సినిమా మే 11న సుదీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా నటిస్తోంది. జె. ప్రభాకర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం, సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ‘ఈరోజుల్లో’, ‘బస్ స్టాప్’ ఫేం మారుతీ ఈ సినిమాకి స్టోరీ, డైలాగులను అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షకునిగా పనిచేస్తున్నాడు. సుదీర్ రెడ్డి – మారుతీ లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదలై మంచి రెస్పాన్ ను పొందింది. ఈ సినిమాలో రేమిక్స్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ పాటలలో ఒకటైన ‘వెన్నెలైన చికటైన’ పాట ఈ సినిమాకి హైలైట్ అవుతుందని ఈ సినిమా నిర్వాహకులు బావిస్తున్నారు. ‘ఈ సినిమా ఇంతవరకు వచ్చిన అన్ని సినిమాకి డిఫరెంట్ గా ఉంటుందని ఈ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఒక పూర్తి ఎంటర్టైనర్ సినిమాగా తెరకెక్కించాం , అలాగే సుదీర్ బాబు, నందితలు చాలా చక్కగా నటించారు’ అని మారుతీ అన్నాడు. ఈ సినిమాకి జె బి సంగీతాన్ని అందించాడు.
విడుదల తేది ఖరారైన ‘ప్రేమ కథా చిత్రమ్’
First Posted at 21:32 on Apr 21st