ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా హీరోయిన్స్ లో నిస్సందేహంగా కథరినే త్రేస హాట్ నటీమణిగా చెలామని అవుతుంది. ‘చమ్మక్ చల్లో’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈమె కృష్ణ వంశీ ‘పైసా’, పూరి జగన్నాద్ద్ ‘ఇద్దరమ్మాయిలతొ’ సినిమాలలో కనబడనుంది. తను దుబాయ్ లో పుట్టి పెరిగినా ఇప్పటికే మలయాళం, కన్నడ చిత్రాలలో నటించి తెలుగులో తన మొదటి చిత్రం విడుదలకు సిద్దంగావుంది. సినీరంగంలోకి రాకముందు ఆమె మోడల్ గా పనిచేసింది. కానీ మనకి ఆమె గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి.
ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకి ఐస్ స్కేటింగ్, పియానో, డిబేటింగ్, సింగింగ్ మరియు డాన్సింగ్ రంగాలలో ప్రావిణ్యం ఉందని తెలిపింది. “మా ఇంట్లోవాళ్ళు నన్ను అన్ని రంగాలలోకి ప్రవేశం కలిగేలా చేసారు. నా మనసుకి నచ్చినది ఏది నేను వదిలిపెట్టలేదని” ఆమె తెలిపింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లలో నిత్య మీనన్ మాత్రమే కొన్ని ఎంపిక చేసుకున్న సినిమాలలో పాటలు పాడతుంది. ఇప్పుడు కథరినే తనకు పాటల్లో ప్రావీణ్యం ఉందని తెలిపింది కనుక ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆమెకు తన తదుపరి సినిమాలలో అవకాసం ఇస్తారేమో చూడాలి.
‘పైసా’లో నాని సరసన నటిస్తున్న ఈమె ‘ఇద్దరమ్మాయిలతొ’ లో అల్లు అర్జున్ సరసన జంటగా కనిపించనుంది. ఈ రెండు సినిమాలు మే నెలలో విడుదల కావచ్చని అంచనా