రవితేజ తాజా చిత్రం ‘బలుపు’ షూటింగ్ ప్రధాన భాగం పూర్తిచేసుకుంది గత పది రోజులుగా చిత్ర యూనిట్ పోర్చుగల్ లో వుంది . గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ వి పోట్లురి పి.వి. పి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ఈ మాస్ ఎంటర్టైనర్ లో రవితేజ సరసన అంజలి,శ్రుతి హాసన్ నటిస్తున్నారు . మొదట లిస్బన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తర్వాత పోర్చుగల్ లోని ఆల్గ్రావే ప్రాంతంలో శ్రుతి హాసన్ ,రవితేజల మధ్య రెండు పాటలు చిత్రీకరించారు . ఈ షెడ్యూల్ ని రేపటి తో ముగించుకుని ఈ వారంతంలోపు హైదరాబాద్ కి తిరిగి రానున్నారు . చిత్ర బృందం మొత్తం అక్కడి అందమైన ప్రదేశాలకి, అక్కడి వారు అందించిన సహకారానికి చాలా సంతోషిస్తున్నారు. అక్కడి మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రుతి హాసన్ ,రవితేజ,గోపి చంద్ మలినేని పోర్చుగల్ టూరిసం డిపార్టుమెంటు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం వేసవి లో విడుదల కానుంది .
పుర్తికావస్తున్న ‘బలుపు’ పోర్చుగల్ షెడ్యూల్
First Posted at 01.31 on Apr 19th