అక్షయ్ కుమార్ తో ఇలియానా రొమాన్స్ చేయనుందా?

First Posted at 16.10 on Apr 18th

ileana
‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత షాహిద్ కపూర్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది. ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన రొమాన్స్ చెయ్యనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. తమిళంలో వచ్చిన ‘రమణ’ సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘గబ్బర్’ పేరుతో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన సంజయ్ లీలా భన్సాలి ఇలియానాని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఈ సినిమాకి తెలుగులో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

Exit mobile version