బాహుబలి కోసం భారీ ఎత్తున కసరత్తు చేస్తున్న రానా

First Posted at 14:00 on Apr 18th

Rana

టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ‘బాహుబలి’ కోసం భారీ ఎత్తున టైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో రానా ప్రభాస్ తో కలిసి నటించనున్నాడు. వాళ్ళిద్దరూ బాడీ బిల్డింగ్ చేసి ఫుల్ కండలు తిరిగిన బాడీతో ఈ సినిమాలో కనిపించనున్నారు. రాజమౌళి ఈ సినిమా కోసం వియత్నాం నుంచి ట్రైనర్స్ ని పిలిపించి ప్రభాస్, రానాకి మార్షల్ ఆర్ట్స్ లో, కత్తి ఫైట్స్ లో శిక్షణ ఇప్పిస్తున్నారు. రానా ఈ రోజు తన ట్విట్టర్ అకౌంట్ లో తనకి ట్రైనింగ్ ఇస్తున్న తౌన్ ఫోటోని పోస్ట్ చేసాడు.

‘పీరియడ్ అడ్వెంచర్’ గా తెరకెక్కుతుందని ఆశిస్తున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం, కాస్ట్యూమ్స్ రామా రాజమౌళి డిజైన్ చేస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్

Exit mobile version