First Posted at 10.42 on Apr 18th
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లలో శృతి హసన్ కి మంచి డిమాండ్ వుంది. ఈ సంవత్సరం తను చాలా బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. మేము విన్న తాజా సమాచారం ప్రకారం శృతి హసన్ ఒక కొత్త సినిమాలో నటించనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న ‘ఆగడు’ సినిమాలో శృతి హాసన్ నటించనుందని ఫిల్మ్ నగర్లో అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయమై మేము ఈ చిత్ర బృందాన్ని సంప్రదిస్తే ‘శృతి హాసన్ ఇంకా ఫైనల్ కాలేదని, కానీ ఆమెని కూడా పరిశీలిస్తున్నామని’ తెలిసింది. ఒకవేళ శృతి అంగీకరిస్తే సూపర్బ్ జోడిని మనం స్క్రీన్ పై చూడవచ్చు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు .