ఆర్.ఎఫ్.సిలో ఫైట్స్ చేస్తున్న రామ్ చరణ్

First Posted at 08.20 on Apr 18th

Ramcharan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ ఈ చిత్ర యూనిట్ ఓ ఫైట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ని పీటర్ హెయిన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి మెయిన్ హైలైట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. స్టైలిష్ థ్రిల్లర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమాని ప్రొడక్షన్ టీం జూన్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Exit mobile version