First Posted at 11:35 on Apr 17th
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి సుప్రీం కోర్ట్ కాస్త ఊరట కలిగించింది. సంజయ్ దత్ లొంగిపోవడానికి 6నెలలు గడువుని కోరగా సుప్రీం కోర్టు తిరస్కరించింది. సంజయ్ దత్ లొంగిపోవడానికి మరో నాలుగు వారాల గడువు మాత్రమే ఇచ్చింది. సంజయ్ దత్ ఒప్పుకున్న సినిమాలన్ని పూర్తి కావాలంటే కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ సినిమాలలో రామ్ చరణ్ సినిమా ‘జంజీర్(తెలుగు వెర్షన్ తుఫాన్)’ ఒకటి. ఈ సినిమా ముఖ్యమైన బాగం ముగిసింది. ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. దీనితో పాటుగా మరికొన్ని సినిమాలలో కూడా సంజయ్ దత్ నటిస్తున్నారు. సంజయ్ దత్ చేయాల్సిన సినిమాలన్నింటికీ కలిపి దాదాపుగా 300కోట్లు ఇన్వెస్ట్ చేసారని సమాచారం.