ఖరారైన వెంకటేష్ మూకీ సినిమా

First Posted at 00.23 on Apr 17th

Venkatesh

విక్టరీ వెంకటేష్ ‘మూకీ’ సినిమాలో నటించడానికి రంగం సిద్దమైంది. అనగా గతంలో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ మూవీ ‘పుష్పక విమానం’ లాంటిది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి వార్తలొస్తున్నాయి ఆ విషయాన్ని ఈ రోజు డైరెక్టర్ జి. అశోక్ కుమార్ రెడ్డి అధికారికంగా అనౌన్స్ చేసారు. నాని నటించిన ‘పిల్ల జమిందార్’ సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు నిర్మించనున్నాడు. ‘వెంకటేష్ గారికి స్టొరీ చెప్పాను ఆయనకి నచ్చడంతో ఓకే చెప్పారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ బాబు గారు నిర్మించనున్నారు.. ఈ బ్యానర్ స్థాపించి 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో ఆ బ్యానర్ లో సినిమా చెయ్యడం ఎంతో ఆనందంగా ఉందని’ అశోక్ కుమార్ రెడ్డి చెన్నైలో అన్నాడు.

ప్రస్తుతం వెంకటేష్ వైవిధ్యమిన పాత్రలను ఎంచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రయోగాలు చెయ్యడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇది ఒక కొత్త ఒరవడి అనే చెప్పుకోవాలి, రానున్న సంవత్సరాల్లో కూడా వెంకటేష్ గారి నుంచి మరిన్ని కొత్త రకమైన సినిమాలతో మనల్ని మెప్పిస్తాడని ఆశించవచ్చు.

Exit mobile version