ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలనుకున్నాను – ప్రియా ఆనంద్

Priya-Anand
‘లీడర్’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ప్రియా ఆనంద్ తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మీరు హీరోయిన్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చారా అని అడిగితే ‘ అలా ఏం లేదు. చిన్నప్పటి నుంచి సినిమాల ప్రభావం ఎక్కువ ఉండేది అందుకే ఇండస్ట్రీలో ఏదో ఒక విభాగంలో సెటిల్ అవ్వాలని వచ్చాను. మొదటగా డైరెక్టర్ అవ్వాలనుకొన్నాను. శంకర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యాలన్నది నా డ్రీం. దాని కోసం ట్రై చేస్తుంటే అనుకోకుండా మోడలింగ్ రంగంలో, అలాగే హీరోయిన్ గా నటించే చాన్స్ వచ్చింది. వయసు ఉన్నప్పుడే హీరోయిన్ గా చెయ్యగలం డైరెక్షన్ అనేది ఎప్పుడన్నా చెయ్యొచ్చు అని నటిగా మారానని’ ప్రియా ఆనంద్ సమాధానం ఇచ్చింది.

అలాగే మాట్లాడుతూ ‘ ఇప్పటికే ‘180’, ‘కో అంటే కోటి’ సినిమాల్లో లిప్ లాక్స్ చేసాను. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్స్ చెయ్యడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాఅని కథకి అవసరం లేకపోయినా బలవంతగా చేయించకూడదని’ ఆమె అన్నారు. ప్రస్తుతం ప్రియా ఆనంద్ తమిళ్ లో రెండు సినిమాలు, హిందీలో ఓ సినిమా చేస్తోంది.

Exit mobile version