First Posted at 15:25 on Apr 15th
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా సూపర్ హిట్ అవడంతో చాలా సంతోషంగా వున్నాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాంకో హిల్స్ లో జరుగుతోంది. ఈ షూటింగ్లో ఎన్.టి.ఆర్, సమంతలు పాల్గొంటున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ శంకర్ పంచ్ డైలాగులు, తను హీరోని పవర్ ఫుల్ గా చూపించే విదానం అందరికి తెలిసిందే. దీనితో ఎన్.టి.ఆర్ అభిమానులంతా ఈ సినిమాపై నమ్మకంతో వున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.