జపాన్ లో ముగియనున్న ‘సమ్ థింగ్…సమ్ థింగ్’ సినిమా షూటింగ్

sidhartha_hansika

సిద్దార్థ్, హన్సిక హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ‘సమ్ థింగ్…సమ్ థింగ్’ సినిమా ప్రస్తుతం జపాన్ లో షూటింగ్ జరుగోతోంది. 29సంవత్సరాల తరువాత జపాన్ లో షూటింగ్ జరుగుతున్న మొదటి సినిమా ఇది. జపాన్ లోని పెద్ద నగరాలలో ఒకటైన టోయమా ఎంతో అందంగా శోభాయమానంగా ఉందని, అక్కడి ప్రజలు మర్యాద, వారిచ్చిన ఆతిద్యం ఎప్పటికి మరిచిపోలేమని ఈ సినిమా టీం అన్నారు. సిద్దార్థ్ ఈ విషయాన్నీ ‘ జపాన్ ప్రజల మర్యాద, అభిమానం మరువలేనిది, ఒక వృద్ద దంపతులతో నేను గడిపిన క్షణాలు నా జీవితంలో ఎప్పటికి మరువలేనిది. ఇసో సుషీ’ అనే ఒక రత్నం ఇక్కడ ఉంది’ అని ట్వీట్ చేశాడు.

జపాన్ లో వున్నా అబిమానులను చూసి ఆశ్చర్యానికి గురైన హన్సిక ‘ ఈ రోజు నాకు చాలా ఆనందంగా వుంది. ఈ రోజు ఒక జపనీ నావద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి నేను నటించిన సినిమాల డీవీడీలను చూపించి నేను మీకు గొప్ప అభిమానని చెప్పాడు. నేను ఇప్పు డు గర్వంగా చెప్పుకోగలను నాకు జపాన్ లో కూడా అబిమానులు వున్నారు’ అని ట్వీట్ చేసింది. ఈ సినిమా బృందం త్వరలో ఇండియాకు తిరిగి రానుంది. సుదీర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఖుష్బు నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ని లక్ష్మీ గణపతి ఫిల్మ్ వారు సొంతం చేసుకున్నారు. సత్య సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మే లో విడుదలైయ్యె అవకాశం వుంది.

Exit mobile version