మధుర శ్రీధర్ తాజా చిత్రం ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ మార్చి 15న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమా ఈ రోజే సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. అయితే మధుర శ్రీధర్ అంచనాలకు భిన్నంగా సెన్సార్ బోర్డు వాళ్ళు కొన్ని సీన్లను కట్ చెయ్యాలన్నరంట. ఆ ఫైనల్ కట్స్ ఏంటో ఇంకా ఖరారు కావాల్సివుంది. మహత్ రాఘవేంద్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి పియా భాజ్ పై మరియు అర్చన కవి హీరొయిన్స్. కాలేజి వయస్సులో చదువు, ప్రేమ మధ్య ఒత్తిడిని తట్టుకోలేని ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కథే ఈ సినిమాకి నేపధ్యం. సునీల్ కశ్యప్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. మల్టీ డైమేన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డా: ఎమ్. వి. కె రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని 200 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.