రోజు రోజుకీ బాగా అభివృద్ధి చెందుతున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ జర్నలిజంలో చాలా మార్పులు తీసుకొస్తోంది. గతంలో అభిమానులు వారికి ఇష్టమైన తారల విషయాలు తెలుసుకోవడం కోసం న్యూస్ పేపర్స్, మాగజైన్ కోసం గానీ ఎదురు చూసేవారు. ట్విట్టర్ వచ్చిన తర్వాత స్టార్స్ కి ఫ్యాన్స్ కి మధ్య ఉన్న దూరం బాగా తగ్గిపోయింది. హీరో లేదా హీరోయిన్ ని ఇష్టపడే అభిమాని ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే మెసేజ్ పంపవచ్చు, ఆ మెసేజ్ వాళ్ళు చదివే అవకాశం ఉంది, అలాగే నచ్చితే రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న నటీ నటులను పబ్లిక్ లో పేరు రావడానికి ఈ ట్విట్టర్ బాగా ఉపయోగపడుతోంది.
కానీ ఈ కొత్త అప్లికేషన్ ద్వారా ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్య కూడా చెడుకి ఆసక్తి చూపే కొంత మంది వల్ల వస్తోంది. కొంత మంది టాప్ స్టార్స్ కి రియల్ లైఫ్ లో పలువురి నుండి విమర్శలు, వారిని తక్కువగా మాట్లాడటం జరుగుతుంటాయి కానీ అవి వారికి ఇబ్బంది కలిగించకుండా చూసుకునే వారుంటారు. కానీ ట్విట్టర్లో స్టార్స్ ని వాటి నుండి కాపాడటానికి వేరే ప్రత్యామ్న్యాయాలు ఏమీ లేవు. స్టార్స్ కొంత మంది నుంచి చెడు మెసేజ్ లను, కొన్ని సందర్భాల్లో అసభ్యకర మెసేజ్ లతో దాడి చేస్తుంటారు.
ఇలాంటి అటాక్స్ జరగడం వల్ల ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్ళు ట్విట్టర్ నుంచి వెళ్ళిపోయారు. అలాగే అల్లు అర్జున్ కూడా మొదలు పెట్టిన అతి తక్కువ టైంలోనే అకౌంట్ డెలీట్ చేసారు. మహేష్ బాబు, అక్కినేని నాగార్జున కోడా రెగ్యులర్ గా ట్వీట్స్ చేయడం మానేశారు. ఎప్పుడో సినిమా రిలీజ్ ముందు గానీ, సందర్భాన్ని బట్టి అరుదుగా ట్వీట్స్ చేస్తుంటారు. మాకు అందిన సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా కొంతమంది చెడు వినియోగదారుల వల్ల ట్విట్టర్ కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు.
ఇదంతా చూస్తుంటే మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది, అదేమిటంటే స్టార్స్ ని ట్విట్టర్ బాధపెడుతోందా? ఖచ్చితంగా వాళ్ళు దీనికి దూరంగా ఉండాల్సిందేనా? బహుశా స్టార్స్ దీన్ని కొంత వరకూ స్పోర్టివ్ గా తీసుకోవాలి అలాగే అభిమానులు కూడా కొంత మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి.
మీరేమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి..