పవర్ఫుల్ యాక్టర్, యాంగ్రీ యంగ్ మాన్ డా. రాజశేఖర్ తను నటించిన ‘మహంకాళి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఈ శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమాకి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజశేఖర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. గతంలో రాజశేఖర్ ఇలాంటి పోలీస్ పాత్రలు చేసి విజయం సాధించారు. సురేందర్ రెడ్డి నిమించిన ఈ సినిమాలో మధురిమ హీరోయిన్ గా నటించింది. పలు కారణాల వల్ల విడుదలకి ఆలస్యమైన ఈ సినిమా మార్చి 8న విడుదలకు సిద్దమైంది.