రాబోయే తమ హిందీ చిత్రం ‘చష్మే బదూర్”కి ప్రమోషన్ చేసే పనిలో తాప్సీ, సిద్ధార్ద్ బిజీగా ఉన్నారు. ఇటివలే మొదలైన ఈ కాంపెయిన్లో ఈ ఇద్దరు తారలు ముంబాయిలో ఒక కాలేజీలో స్టూడెంట్స్ ని కలిసారు. నిజానికి ఈ సినిమా తాప్సీకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఆమె నటించిన మొదటి హిందీ సినిమా. చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 5న విడుదల అవుతుంది. డేవిడ్ ధావన్ ఈ సినిమాకి దర్శకుడు. అలీ జాఫర్, దివెయుందు శర్మ మిగిలిన ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం తాప్సీ మార్చ్ 8న విడుదల అయ్యే తన తాజా తెలుగు చిత్రం ‘గుండెల్లో గోదారి’ విడుదల కోసం ఎదురుచూస్తుంది. ఆమె వెంకటేష్ ‘షాడో’, చంద్రశేఖర్ యేలేటి యాక్షన్ అడ్వెంచర్ లో, లారెన్స్ తో ‘ముని-3’ లో మరియు అజిత్ తో ‘వాలాయి’లో నటిస్తుంది