స్టార్ హీరో గెస్ట్ గా బలుపు ఆడియో ఫంక్షన్

Balupu

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘బలుపు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్లో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఏప్రిల్ లో విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ కి ఒక స్టార్ హీరో ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ప్రస్తుతం ఆ హీరో పేరును చెప్పలేము కానీ తను తెలుగులో ఫేమస్ హీరో. భారీ బడ్జెట్ తో పీవిపీ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ మాస్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం రవితేజకి హిట్ అవసరం కాబట్టి ఈ సినిమాపై తను చాలా ఆశలు పెట్టుకున్నాడు,
ఈ ఆడియో ఫంక్షన్ కి రాబోతున్న స్టార్ హీరో పేరును తొందర్లో తెలియజేస్తాం.

Exit mobile version