‘డాన్సింగ్ స్టార్’ సునీల్ పుట్టినరోజు ఈ రోజు, ఎప్పటిలా కాకుండా తన పుట్టిన రోజును కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి జరుపుకున్నారు. సునీల్ తన పుట్టిన రోజు వేడుకను దేవనార్ బ్లైండ్ స్కూల్ లో చూపులేని పిల్లల మద్య జరుపుకున్నారు. ఈ పుట్టిన రోజు ఫంక్షన్ కు బెల్లంకొండ సురేష్, డైరెక్టర్ బి.జయ, స్వామి గౌడ్ తదితరులు హాజర్యయారు. సునీల్ స్కూల్ వెల్ఫేర్ ఫండ్ కి 2లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. దేవనార్ స్కూల్ లో పుట్టిన రోజు జరుపుకున్నసునీల్ మాట్లాడుతూ ‘ నేను మొదట ఇక్కడకి ‘శంబో శివ శంబో’ సినిమా షూటింగ్ అప్పుడు వచ్చాను. బెల్లంకొండ సురేష్ ఈ స్కూల్ గురించి చాలా మంచి విశేషాలు చెప్పారు, నేను ఈ స్కూల్ కోసం 2లక్షలు రూపాయలు విరాళంగా ఇస్తున్నాను ఇది పెద్ద అమౌంట్ కాకా పోవచ్చు కానీ ఇది చూసి చాలా మంది విరాళాలు ఇస్తారన్న నమ్మకం ఉందని’ అన్నాడు.
సునీల్ ‘మిస్టర్ పెళ్ళికొడుకు’ రేపు విడుదలకానుంది. ఈ సినిమా ప్రిమియర్ షోని ఈ రోజు రాత్రి హైదరాబాద్ లో ప్రదర్శించనున్నారు.