విక్టరీ వెంకటేష్ ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో అన్నదమ్ముల అనుబంధాన్ని ఒక దృశ్యకావ్యంలా తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకటేష్ ప్రస్తుతం తన ఫోకస్ తదుపరి సినిమా ‘షాడో’ పై పెట్టారు. ఈ సినిమాలో వెంకటేష్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో వెంకటేష్ తన ఫాన్స్ కి యాక్షన్ ట్రీట్ ఇవ్వనున్నాడు.
మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ కాగా, శ్రీకాంత్, మధురిమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పరుచూరి కిరీటి నిర్మించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియోని మార్చిలో, సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.