యూనివర్సల్క హీరో మల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ సినిమా విడుదలకి ముందు పలు వివాదాల్లో ఇరుక్కుంది. ప్రస్తుతం ఈ సినిమా విషయమై కమల్ ‘కాంపిటేషన్ కమీషన్’ ని సాయం కోరారు. ఇది వరకు సినిమా విడుదలకి అడ్డుకున్న కొంతమంది థియేటర్ అసోషియేషన్ పై వ్యతిరేకంగా ఫెయిర్ ట్రేడ్ కాంపిటేషన్ కమీషన్ ని కలిసారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఈ సినిమాని డి.టి.హెచ్ లో రాజ్ కమల్ ఫిల్మ్స్ వారు జనవరి 10న రిలీజ్ చెయ్యాలి, కానీ అది రద్దయ్యింది. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.