హీరోల కంటే పాత్రలే తెరపై కనిపించాయి – దిల్ రాజు

Dil-Raju

రెండు దశాబ్దాల తర్వాత టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్బ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘ వెంకటేష్, మహేష్ బాబు అభిమానులు సినిమాని ఎలా తీసుకుంటారో అని కొంత భయపడ్డాం కానీ వారందరూ సినిమా ఫస్ట్ షో అయిన తర్వాత మేము తెర మీద మా హీరోల కంటే సినిమాలో పాత్రలనే చూసాం అని చెప్పటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఫోన్ చేసి మేమంతా మరచిపోయిన పాయింట్ తో సినిమా తీసావు. అది కూడా ఇద్దరు హీరోలని పెట్టి డైరెక్టర్ శ్రీ కాంత్ చాలా బాగా తీసాడని చెప్పడం నా సినిమాకి దక్కిన గొప్ప విజయం అని’ దిల్ రాజు అన్నారు.

వెంకటేష్ – మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమాలో సమంత, అంజలి హీరోయిన్స్ గా నటించారు. శ్రీ కాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించగా, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version