సీతమ్మ వాకిట్లో … ఆడవారికి కోసం స్పెషల్ షోలు

SVSC
ఫామిలీ ఎంటర్టైనర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నిన్న విడుదలై సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంటే మరో వైపు టికెట్స్ దొరకక చాలా మంది ఆడవారు ఇబ్బంది పడుతున్నారు. అయితే వారి కోసం కొన్ని ఏరియాల్లో కొన్ని స్పెషల్ షోలు వేయనున్నట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పారు. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లని అక్కడ ఉండే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు పండగ రోజుల్లో వారికోసం స్పెషల్ షోలు వేయాలని అనుకుంటున్నాం అన్నారు. గుంటూరులోని హాలీవుడ్ ధియేటర్లో 14వ తేదీన మార్నింగ్ షో కేవలం ఆడవారికి మాత్రం షో వేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా మీద వారికున్న క్రేజ్ అలాంటిదని మరోసారి నిరూపిస్తుంది. మరో వైపు ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రీమియర్ల రూపంలో కోటిన్నర పైగా కలెక్షన్లు వచ్చాయి

Exit mobile version