మహేష్ గమ్మత్తయిన డైలాగ్స్ కి భారీ స్పందన

Mahesh-Babu
ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ మల్టీ స్టారర్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఈరోజు విడుదల అయ్యి మంచి స్పందన దక్కించుకుంది. అనుకున్న విధంగానే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా గోదావరి యాసలో అయన చెప్పిన డైలాగ్స్ గమ్మత్తుగా ఉండటమే కాకుండా అందరిని ఆకట్టుకుంది. వెంకటేష్, మహేష్ బాబు ,సమంత మరియు అంజలి ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దిల్ రాజు నిర్మించగా మిక్కి జె మేయర్ సంగీతం అందించారు.

Exit mobile version