మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాయక్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉన్నాడు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమా నిన్న విడుదల కాగా బాక్స్ ఆఫీసు నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మరో హిట్ ఖాయమని చెబుతున్నారు. సంక్రాంతి సెలవుల సీజన్ కి ముందు విడుదల కావడం, ఇంకా సెలవులు ముందే ఉండటంతో కలక్షన్లు కూడా బాగానే వస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర లాంటి కొన్ని ఏరియాల్లో ఓపెనింగ్ డే రికార్డు వస్తుందని అంచనా వేస్తున్నారు. రచ్చ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో క్రేజ్ వచ్చింది. దీనికి తోడు చరణ్ డాన్సులు, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం కామెడీ సినిమాని నిలబెట్టాయి.