నాయక్ రెస్పాన్స్ చూసి ముచ్చటపడుతున్న నాయిక

Kajal
‘నాయక్’ సినిమాలో రామ్ చరణ్ నాయికగా నటించిన కాజల్ ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ముచ్చటపడుతుంది. ఈ రోజు నాయక్ ప్రమోషన్లో భాగంగా హైదరబాద్ వచ్చిన ఆమె నాయక్ ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్స్ సందర్శించారు. రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్లో గతంలో బ్లాక్ బస్టర్ హిట్ మగధీర తరువాత ఈ సినిమా వచ్చింది. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ మగధీర సమయంలో రెండేళ్ళు కలిసి పనిచేసాము. సో చరణ్ తో కలిసి పనిచేయడం ఈజీగా అయిపోయింది. మగధీరకి వచ్చిన స్థాయిలో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు వివి వినాయక్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన ఆమె నటించిన స్పెషల్ చబ్బిస్, బాద్షా రెండు సినిమాలు ఈ సంవత్సరం విడుదల కానున్నాయి.

Exit mobile version