మాస్ మసాలా డైరెక్టర్ వివి వినాయక్ చేతిలో రూపుదిద్దుకున్న నాయక్ రేపు భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ చరణ్ ని చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసినట్లే ఉంది. ఆయనలో ఉండే మెరుపు చరణ్ లో కూడా ఉంది. చాలా సన్నివేశాల్లో చరణ్, చిరంజీవి గారిని ఇమిటేట్ చేసారని అంటున్నారు. ఆయనలో ఉండే స్పార్క్ చరణ్ లో కూడా ఉండటం వల్ల అల అనిపిస్తుంది. నేను డైరెక్ట్ చేసిన ఠాగూర్ చేసినపుడు బాగా ఒత్తిడి ఉండేది. ఆయనని ఎలా చూపించాలా అన్న భయం ఉండేది. చరణ్ తో చేస్తున్నపుడు అవి లేవు ఎందుకంటే చరణ్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. చరణ్ నటనలో సహజత్వం కనిపిస్తుంది.