ఒంటరిగా ఉండడం ఒక వరం అంటున్న మిల్క్ బ్యూటీ

Tamanna-New
‘నా చుట్టూ అందరూ ఉంటే నాకు ఇష్టం , కానీ ఒంటరిగా ఉండటం అనేది ఒక వరం అని అనుకుంటాను. అలా ఒంటరిగా ఉండే సమయం నా లైఫ్ గురించి ఆలోచించుకోవడానికి సరైన సమయం అని’ మన మిల్క్ బ్యూటీ తమన్నా ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న తమన్నా 2012లో మిశ్రమ ఫలితాలను అందుకుంది. తన అభిప్రాయాల్ని చెబుతూ ‘ నా ప్లస్ – మైనస్ ల గురించి నాకు తెలుసు. నేనేప్పుడైతే ఒంటరిగా ఉంటానో అప్పుడు నేను చేసిన తప్పుల గురించి ఆలోచిస్తాను , ఆ ఆలోచన అలాంటి తప్పులు మళ్ళీ చేయకూడదు అనే క్లారిటీని ఇస్తాయని’ తమన్నా అంది.

ప్రస్తుతం తమన్నా తెలుగులో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘సెట్టై’ రీమేక్లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్లో చేస్తున్న ‘హిమ్మత్ వాలా’ రీమేక్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా త్వరలోనే ‘శౌర్యం’ శివ డైరెక్షన్లో అజిత్ హీరోగా మొదలుకానున్న సినిమాలో నటించనుంది.

Exit mobile version