ఇటీవల నాయక్ టైటిల్ వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. నాయక అనే పదం రాజ్యాంగం తమకు హక్కుగా ఇచ్చిందనీ, ఆ పదాన్ని ఒక కమర్షియల్ సినిమాకి వాడుకోవడం తమని అవమానించినట్లుగా ఉందనీ, తక్షణం టైటిల్ మార్చాలని గొడవ చేసిన లంబాడి విద్యార్ధి నాయకుల మాటలు సెన్సార్ పరిగణలోకి తీసుకుంది. సెన్సార్ పూర్తయిన తరువాత ఈ సినిమాలో లంబాడి వారికి సంభందించిన సన్నివేశాలు ఏవీ లేవని నాయక్ టైటిల్ కి క్లియరెన్స్ ఇచ్చింది. అయితే దీని మీద గిరిజన విద్యార్ధి నాయకులు మాత్రం విభేదిస్తున్నారు. తాము మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని అంటున్నారు. ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.