స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘ఇద్దరమ్మాయిలతో’ షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్‌లో ఉన్నాడు. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం థాయ్ ఫైట్ మాస్టర్ కీచాతో కలిసి పని చేస్తున్నాడు. ఈ ఫైట్ మాస్టర్ వర్క్ చూసి ఫిదా అయిపోయిన అల్లు అర్జున్ కీచాని తెగ పోగుడుతున్నాడు. కీచా టీం వర్క్, లో కాస్ట్, పని పట్ల శ్రద్ధ చూసి ముచ్చటేస్తుందని అన్నాడు. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. మరో వైపు అల్లు అర్జున్ మొదటి ఇద్దరు హీరోయిన్ లతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు. అమలా పాల్, కేథరిన్ తెరిసా కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.