సేవా పన్ను రద్దు చేయాలని ధర్నా చేసిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ

Abolish-Service-Tax
తెలుగు చలన చిత్ర పరిశ్రమ లోని ప్రముఖులంతా కలిసి ఈ రోజు ఫిలిం ఛాంబర్లో ధర్నాకు దిగారు. సేవా పన్ను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ డి. రామానాయుడు, అల్లు అరవింద్, వెంకటేష్, జగపతి బాబు, నాని, మురళి మోహన్, అలీ తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఎన్నో పన్నులు కడుతున్న మాపై సేవా పన్ను రూపంలో మరో భారం మోపబోతున్నారు. 12.36 శాతం సేవా పన్ను కట్టాలంటూ జూలై నుండి ప్రభుత్వం భారం మోపనుంది. మా సమస్యలు అర్ధం చేసుకొని ఈ పన్నుని రద్దు చేయాలని మురళి మోహన్ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్లాక్ మనీ ఉండేది. ఇప్పుడు వైట్ మనీనే పన్ను రూపంలో కడుతున్నాం. ఇప్పుడు ఉన్న పన్నులు చాలవన్నట్లు ఈ సేవా పన్ను విధిస్తే మళ్లీ ఇండస్ట్రీ లోకి బ్లాక్ మనీ వస్తుంది అన్నాడు.

Exit mobile version