అందాల భామ కాజల్ అగర్వాల్ ‘సింగమ్’ సినిమా చేసి సక్సెస్ అందుకున్న తర్వాత బాలీవుడ్లో అక్షయ్ కుమార్ సరసన చేస్తున్న రెండవ సినిమా ‘స్పెషల్ చబ్బీస్’. ఈ సినిమాలో ఆమె స్కూల్ టీచర్ గా కనిపించనుంది. ఈ సినిమా 1987 లో జరిగిన ఒక మామూలు యదార్థ సంఘటన ఆధారంగా తీస్తున్నారు. అదేమిటంటే ఒక వ్యక్తి సి.బి.ఐ ఆఫీసర్ అని చెప్పి 26మందిని తన టీంగా సెలక్ట్ చేసుకొని పెద్ద పెద్ద వారి ఇళ్ళపై దాడి చేసి బంగారం, నగదుతో పారిపోయిన దాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, జిమ్మీ షెర్గిల్, మనోజ్ బాజ్పాయి, అనుపమ్ ఖేర్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘సింగమ్’ తర్వాత బాలీవుడ్లో ఆఫర్లు వస్తాయనుకున్న కాజల్ కి అంతగా అవకాశాలు రాకపోవడంతో ఈ సినిమా విజయంపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. గతంలో ‘ఎ వెడ్నెస్ డే’ సినిమా తీసిన నీరజ్ పాండే ఈ సినిమాకి డైరెక్టర్. స్పెషల్ చబ్బీస్ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ప్రస్తుతం కాజల్ ఈ సినిమా కాకుండా ‘బాద్షా’ సినిమా షూటింగ్లో పాల్గొంటోంది, అలాగే తను నటించిన ‘నాయక్’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది.