అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రభాస్ లుక్

prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘మిర్చి’ సినిమా ఆడియో రిలీజ్ నిన్న సాయంత్రం జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్ తన లుక్ తో అందరినీ ఆశ్చర్య పరిచాడు. మిర్చి టీజర్స్, పోస్టర్స్ లో ఫుల్ క్లాస్ లుక్ తో ఉన్న ప్రభాస్ ఈ వేడుకకి ఫుల్ గడ్డంతో వచ్చారు. మీ లుక్ ఇలా ఎందుకు మార్చారు అని అడిగితే ‘ నేను రాజమౌళి గారి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నానని’ సమాధానం ఇచ్చాడు. రాజమౌళి డైరెక్ట్ చేయనున్న సినిమాకి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. అనుష్క హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది.

ప్రస్తుతానికైతే అందరి చూపులు ‘మిర్చి’ పైనే ఉన్నాయి. పలనాడు బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుష్క – రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ద్వారా కొరటాల శివ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. వంశీ – ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Exit mobile version