“అల వైకుంఠపురములో” డామినేషన్ మాములుగా లేదు.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ చిత్రానికి ముందు బన్నీ, త్రివిక్రమ్ ఇద్దరికీ సరైన విజయం లేదు. మరి ఏమనుకొని ఈ చిత్రం స్టార్ట్ చేసారో కానీ ప్రతీ ఒక్క అంశంలో కూడా ఈ చిత్రం ఏ రికార్డును వదల్లేదు.

తెలుగులో ఆల్ టైం టీఆర్పీ రికార్డుతో సంచలనం రేపగా ఏకంగా 2 కోట్లకు పైగా టెలివిజన్ ఇంప్రెషన్స్ తో మన దక్షిణాదిలోనే రికార్డు నెలకొల్పింది. అయితే ఈ డామినేషన్ కేవలం మన సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా హిందీ చిత్రాలతో కూడా పోటీ పడేంతలా వచ్చింది.

రెండు కోట్లకు పైగా ఇంప్రెషన్స్ ను రాబట్టిన టాప్ 5 చిత్రాల జాబితాలో నిలిచినా ఏకైక తెలుగు చిత్రంగా ఇపుడు అల వైకుంఠపురములో నిలిచింది. మిగతా అన్ని చిత్రాలు కూడా హిందీ భాషలో ఉన్నవే. ఈ జాబితాలో బాహుబలి 2 హిందీ వెర్షన్ 2 కోట్ల 60 లక్షల ఇంప్రెషన్స్ తో మొదటి స్థానంలో ఉండగా అల వైకుంఠపురములో 2 కోట్ల 19 లక్షల ఇంప్రెషన్స్ తో 5 వ స్థానంలో ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది.

Exit mobile version