బిగ్గెస్ట్ రియాలిటీ షోకు డేట్ వచ్చేసింది.!

ఒక్క మన తెలుగులోనే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో “బిగ్ బాస్”. మన దేశంలో కూడా పలు కీలక భాషల్లో విజయవంతంగా ఎన్నో సీజన్లను పూర్తి చేసుకొని నడుస్తున్న ఈషో మన తెలుగులో కూడా భారీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. అయితే ఇప్పటి వరకు మొత్తం మూడు సీజన్లతో అలరించిన ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టింది.

గత సీజన్ ను అద్భుతంగా రక్తి కట్టించిన కింగ్ నాగార్జునే మళ్ళీ ఈ షోను హోస్ట్ చేస్తుండడంతో మరోసారి అంచనాలు పెరిగాయి. అయితే ఈ షో షూటింగ్ ఇటీవలే లాక్ డౌన్ నిబంధనలతో మొదలయ్యింది. గత కొన్ని రోజుల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ షో ఇప్పుడు ఎట్టకేలకు ఒక ఫైనల్ డేట్ ను తెచ్చుకుంది.

నిజానికి ఈ ఆగష్టు 30న లాంచ్ కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల ఆలస్యం అయ్యింది కానీ ఇపుడు వచ్చే సెప్టెంబర్ 6 వ తారీఖున సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఆ తర్వాత యథా విధిగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అలాగే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. మరి కింగ్ నాగార్జున మళ్ళీ ఎలా ఈ సీజన్ ను నడిపిస్తారో చూడాలి.

Exit mobile version