సుశాంత్ కేసులో మరిన్ని ఊహించని నిజాలు!

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య ఘటన అక్కడ ఎంతటి విషాదాన్ని నెలకొల్పిందో అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత నుంచి అసలు ఇది ఆత్మ హత్యా కాదా అనే ప్రశ్నపై ఇప్పటికీ చాలా సుస్పెన్స్ నడుస్తూనే ఉంది. ఇటీవలే సిబిఐ కు అప్పగించబడిన ఈ కేసులో ఇప్పుడు మరిన్ని ఊహించని నిజాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సుశాంత్ సన్నిహితుడు సిద్దార్థ్ పితానిని గత కొన్ని రోజుల నుంచి చేస్తున్న విచారణలో భాగంగా మరిన్ని సంచలన నిజాలు బయటపడినట్టు తెలుస్తుంది. గత జూన్ నెల 8 వ తారీఖున సుశాంత్ కు మరియు అతని గర్ల్ ఫ్రెండ్ రియాకు పెద్ద గొడవ జరిగింది అని అలాగే సరిగ్గా అదే రోజున సుశాంత్ కు సంబంధించిన ఎనిమిది హార్డ్ డిస్క్ డ్రైవ్ లు ధ్వంసం చెయ్యబడ్డాయి అని అతను తెలిపారు.

దీనితో ఆ హార్డ్ డిస్క్ లలో వారికి సంబంధించిన సమాచారం ఏదన్నా ఉండి ఉంటుంది అని మరో కొత్త కోణం లేవనెత్తుతుంది. అయితే వాటిలో ఎలాంటి సమాచారం ఉందో తనకి కూడా తెలియదని సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ తెలిపారు. ఇప్పటికే రియా చక్రబర్తి పై చాలా నెగిటివి ఉంది, ఇప్పుడు ఈ సరికొత్త అంశం ఆమెకు ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతుందో మరి.

Exit mobile version