కొత్త ట్రెండ్ – నిర్మాతలు మిడ్ రేంజ్ హీరోల మార్కెట్ ను ఆలోచించరా

ఒక సినిమా తెరకెక్కించాలి అంటే తెర వెనుక ఎందరో కష్టం ఉంటుంది. వారందరికి వెనుక ఉండేది మాత్రం ఆ చిత్రాన్ని నిర్మించే నిర్మాత. ఒక హీరోతో ఒక చిత్రం చేస్తున్నారు అంటే సవా లక్ష ప్రశ్నలు సెంటిమెంట్లు లేవనెత్తుతాయి. ఇవన్నీ బేరీజు వేసుకొని ఒక నిర్మాత ముందుకొచ్చి సినిమా చేస్తే దాని ఫలితం ఎలా ఉండనుందో అని తెలుసుకోడానికి వారై సినిమా విడుదల రోజు మొదటి ఆట వరకు ఎన్నో టెన్షన్లు ఉంటాయి.

మొత్తం మన దేశీయ సినీ ఇండస్ట్రీలోనే ఒక స్టార్ హీరోతో సినిమా అయితే ఎలా లేదన్న సగం అయినా రికవర్ అవుతుంది. కానీ మిడ్ రేంజ్ హీరోలతో ఒక సినిమా చెయ్యాలి అంటే అది కత్తి మీద సాము లాంటిదే అని చెప్పాలి. ఆ హీరో రేంజ్ ఎంత వరకు ఉంది? మనం ఎంత వరకు పెట్టొచ్చు? పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా లేదా ఇలా ఎన్నో అంశాలను నిర్మాతలు ఆలోచించి మిడ్ రేంజ్ హీరోతో ఒక సినిమా తీస్తారు.

అయితే ఆ సినిమా హిట్ అయితే పర్వాలేదు కానీ ఫట్టయితే పెద్ద ఎత్తున నష్టాలు తప్పవు. కానీ ఇదంతా పాత ట్రెండ్ ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ తో మొత్తం మారింది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు చాలా చిత్రాలు మిడ్ రేంజ్ హీరోలు సినిమాలే నేరుగా ఓటిటిలోకి వస్తున్నాయి. ఇక్కడే ఆ హీరోకు మరియు నిర్మాతకు సంబంధించి రెండు వెర్షన్ లు కనిపిస్తాయి.

ఒకవేళ సినిమా చాలా బాగున్నట్టయితే నిర్మాత ముందు ఎలాగో సినిమాను అమ్మేసుకున్నారు కాబట్టి వచ్చే లాభాన్ని కోల్పోతాడు. ఇక్కడ హీరో సేఫ్ అయ్యిపోతాడు. కానీ ఒక వేళ సినిమా టాక్ బాగోకపోతే నిర్మాతలు ఎలాగో పెట్టిన డబ్బుకు అమ్మేసుకున్నారు కాబట్టి వారు సేఫ్ అయ్యిపోతారు. ఇప్పుడు సరికొత్తగా నెలకొన్న ఈ ట్రెండ్ వల్ల వచ్చిన ఓటిటి రిలీజ్ లతో ఈ హీరోలకు ఎలాంటి నష్టమూ లేదని చెప్పాలి.

Exit mobile version